వైభవం.. వాహనోత్సవం
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

వైభవం.. వాహనోత్సవం


విజయకనకదుర్గాదేవి

అంబాజీపేటలో గురువారం రాత్రి అంగరంగ వైభవంగా బేతాళస్వామి వారి వాహన మహోత్సవం జరిగింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన ఈ వాహనమహోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. స్థానిక శెట్టిబలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఇక్కడి 13 శెట్టిబలిజ పాలెంలకు చెందిన ప్రజలు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై దేవుళ్ల విగ్రహాలను ఉంచి ఊరేగించారు. ఈ సందర్భంగా చేఢీతాళింఖాన, గరగనృత్యాలు, డీన్‌మార్‌ డప్పువాయిద్యాలు, డీజే సంగీతం వంటివి ఈ వాహనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, అమలాపురం గ్రామీణ సీఐ సురేష్‌బాబు, ఎస్సై చైతన్యకుమార్‌ల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.సంఘం అధ్యక్ష,కార్యదర్శులు దొమ్మేటి వెంకటరామరావు, మట్టపర్తి రాము, ఉత్సవకమిటీ అధ్యక్షుడు శీలం సత్యఅర్జునమోహనరావు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

రెండెడ్ల బండిపై ఆంజనేయస్వామి వారి వాహనం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని