పేకాట శిబిరంపై దాడి..రూ.2.15 లక్షలు స్వాధీనం
eenadu telugu news
Published : 22/10/2021 06:03 IST

పేకాట శిబిరంపై దాడి..రూ.2.15 లక్షలు స్వాధీనం

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: అర్బన్‌ ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీలత పర్యవేక్షణలో స్పెషల్‌ పార్టీ ఇన్‌స్పెక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు, కడియం ఇన్‌ఛార్జి సీఐ రాంబాబుకు వచ్చిన సమాచారంతో ఎస్‌ఐ అమీనాబేగం సిబ్బందితో కలిసి బుధవారం అర్ధరాత్రి భారీ పేకాట శిబిరాలపై దాడులు చేశారు. మండలంలోని బుర్రిలంక ఆదియ్య పుంతరోడ్డు ఖాళీస్థలంలో పేకాట ఆడుతున్న 17 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.2.15 లక్షలు, 18 సెల్‌ఫోన్లతో పాటు 23 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలి నుంచి మరో ఆరుగురు వ్యక్తులు పరారయ్యారు. మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వీరిలో ఎ-1గా ఉన్న శాకా పట్టాభిని శిబిర నిర్వాహకుడిగా గుర్తించామని డీఎస్పీ ఎం.శ్రీలత తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని