గుండెపోటుతో తహసీల్దారు మృతి
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

గుండెపోటుతో తహసీల్దారు మృతి


పి.రాజు

 

తొండంగి, న్యూస్‌టుడే: విధులు నిర్వహిస్తుండగా తహసీల్దారు గుండెపోటుతో మృతిచెందిన ఘటన తొండంగిలో చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండంగి తహసీల్దారు పి.రాజు(52) శుక్రవారం ఉదయం కార్యాలయం నుంచే ఆర్డీవో నిర్వహిస్తున్న వీసీకి హాజరయ్యారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కుర్చీలోంచి కిందపడ్డారు. సిబ్బందిని పిలిచి గుండెనొప్పిగా ఉందని, ఈనో ప్యాకెట్‌ తీసుకురమ్మని చెబుతూ స్పృహ కోల్పోయారు. సిబ్బంది తొండంగి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స చేసినా స్పందించట్లేదని వైద్యాధికారి విమల చెప్పారు. షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తే ప్రయోజనం ఉంటుందని తుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని ఆర్‌ఐ శ్రీరాంప్రసాద్‌ వాపోయారు. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు డిగ్రీ పూర్తి చేశాడు. విధులు నిర్వహిస్తుండగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, తొండంగిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని