ఉరుములు.. మెరుపులు.. వర్షం
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

ఉరుములు.. మెరుపులు.. వర్షం


కాకినాడ జడ్పీ సెంటర్‌ వద్ధ.

కాకినాడ కలెక్టరేట్‌, సాంబమూర్తినగర్‌, న్యూస్‌టుడే: కాకినాడలో శుక్రవారం రాత్రి ఉరుములు మెరుపులు.. ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై పెద్ద శబ్దంతో పిడుగులు పడడంతో నగర వాసులు ఆందోళన చెందారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు జోరుగా వాన కురిసింది. దుమ్ములపేట ప్రాంతంలో ఒక చెట్టుపై పిడుగు పడటంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రాంతంలో ఇళ్లలోని ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు దెబ్బతిన్నాయి. కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌, కస్టమ్స్‌ కార్యాలయాల పరిధిలో వర్ష బీభత్సం నెలకొంది. భారీ ఉరుములకు తీరం వెంబడి భయానక వాతావరణం నెలకొంది. కాకినాడ డివిజన్‌ పరిధిలోని ఏడు సెక్షన్ల పరిధిలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. వర్షం తగ్గిన తరువాత దశల వారీగా సరఫరాను పునరుద్ధరించారు. పెద్దాపురం, రామచంద్రపురం డివిజన్లలో తేలికపాటి జల్లులు కురిశాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని