25 నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

25 నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు


పుష్పాలంకరణలో వేంకటేశ్వరుడు

 

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లిలో ఏడు వారాల వెంకన్నస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. దేవదేవుడు దేవేరులతో ఈ నెల 25 నుంచి తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నాడు. ఈ సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకుని జన్మ ధన్యం చేసుకోవాలనే తలంపుతో భక్తకోటి వాడపల్లి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో దేవస్థానం వాడపల్లి క్షేత్రాన్ని విద్యుద్దీపాలు, రంగుల పూల తోరణాలు, అరటి, మామిడి ఆకులతో తీర్చిదిద్దారు. సోమవారం నుంచి నవంబరు ఒకటి వరకు శేష, హంస, హనుమ, సింహ, గరుడ, సూర్య, చంద్రప్రభ, గజ, అశ్వవాహనాలపై శ్రీవారు ఊరేగుతూ భక్త జనులను కటాక్షిస్తారు. చివరి రోజు నవంబరు 2 ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం, రాత్రి చూర్ణోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని