ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌కు సహకరించాలి: డీఈవో
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌కు సహకరించాలి: డీఈవో


మాట్లాడుతున్న డీఈవో అబ్రహం, తదితరులు

కాకినాడ నగరం: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంఘాలు సహకరించాలని డీఈవో ఎస్‌.అబ్రహం కోరారు. కాకినాడలోని డీఈవో కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగోన్నతుల ప్రక్రియపై ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియారిటీ, ప్రాధాన్యాంశాలు దృష్టిలో ఉంచుకుని ఉద్యోగోన్నతులు కల్పిస్తామన్నారు. ఇప్పటికే సీనియారిటీ జాబితాలను వెబ్‌సైట్లో ఉంచామని చెప్పారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని సంఘాల సలహాలు, సూచనలతో ఉద్యోగోన్నతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు సంఘాలు చేసిన సూచనలను ఆయన నమోదు చేసుకున్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు పీఎస్‌ హెచ్‌ఎం పోస్టు మంజూరు చేయాలని, పదోన్నతుల్లో అడహక్‌ స్థానాలు కాకుండా గతంలో మాదిరి నియామకాలు చేపట్టాలని సంఘాలు డీఈవో దృష్టికి తీసుకెళ్లాయి. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు తిలక్‌బాబు, ప్రదీప్‌కుమార్‌, చామంతి నాగేశ్వరరావు, చక్రవర్తి, జ్యోతిబసు, రాఘవులు, డి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని