ఓఆర్‌ పెంపుపై ప్రధాన దృష్టి : ఆరీ్టసీ ఈడీ
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

ఓఆర్‌ పెంపుపై ప్రధాన దృష్టి : ఆరీ్టసీ ఈడీ


అధికారులు, డీఎంలకు సూచనలిస్తున్న ఈడీ బ్రహ్మానందరెడ్డి

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఆక్యుపెన్సీరేషియో(ఓఆర్‌) మరింత పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) కె.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరం డిపో వద్ద ఆర్టీసీ ట్రైనింగ్‌ కళాశాలలో శుక్రవారం జిల్లాస్థాయి అధికారులు, తొమ్మిది డిపోల మేనేజర్లతో ఆయన సమీక్షించారు. డిపోల వారీగా ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులు, ఓఆర్‌ శాతం తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. కొవిడ్‌కు ముందు 75 నుంచి 78 శాతం వరకు ఓఆర్‌ ఉండేదని, ఇప్పుడు దానిని సాధించే దిశగా సిబ్బంది కృషి చేయాలన్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ మంది ప్రైవేటు బస్సులను ఎందుకు ఆశ్రయిస్తున్నారనే దానిపై గత నెల జరిపిన సర్వే ద్వారా గుర్తించిన అంశాల ఆధారంగా ఆర్టీసీ సర్వీసుల్లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ఉద్యోగులు, వ్యాపారులు వివిధ వర్గాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని వారికి అనుకూలమైన సమయాల్లో బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్టీసీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ నాగేంద్రప్రసాద్‌, చీఫ్‌ మేనేజర్‌(కమర్షియల్‌) చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని