కొనసాగిన జనాగ్రహదీక్ష
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

కొనసాగిన జనాగ్రహదీక్ష


అమలాపురం: శిబిరంలో మంత్రి విశ్వరూప్‌ తదితరులు

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన వైకాపా శ్రేణులు నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్షలు రెండో రోజు శుక్రవారం జిల్లావ్యాప్తంగా కొనసాగాయి. ● అమలాపురం హైస్కూల్‌ సెంటర్‌లో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పాల్గొన్నారు. ● పి.గన్నవరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. ● ప్రత్తిపాడులో కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. ● పి.గన్నవరం, రాజోలులో అమలాపురం ఎంపీ అనూరాధ హాజరయ్యారు. ● కాకినాడ గ్రామీణం సర్పవరం జంక్షన్‌, తుని, పిఠాపురంలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ వంగా గీత పాల్గొన్నారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ముమ్మిడివరంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌, పిఠాపురంలో ఎమ్మెల్యే దొరబాబు, అనపర్తిలో ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, రాజోలులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ● రంపచోడవరంలో చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆధ్వర్యంలో దహనం చేశారు. ● కాకినాడ నగరంలోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ● రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్‌ వద్ద, రామచంద్రపురం దీక్షలో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ● మోరంపూడి జంక్షన్‌ వద్ద స్మార్ట్‌సిటీ ఛైర్మన్‌ చందన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హైవే దిగ్బంధం చేసి.. మానవహారంగా ఏర్పడ్డారు. ● క్వారీ మార్కెట్‌ సెంటర్‌ వద్ద కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్‌ పాల్గొన్నారు. ● పెద్దాపురంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, మండపేట, రామచంద్రాపురం, జగ్గంపేట కొత్తపేట, రావులపాలెంలో వైకాపా శ్రేణులు నిరసన తెలిపాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని