ఆర్టీసీ డీసీఎంఈ బాధ్యతల స్వీకరణ
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

ఆర్టీసీ డీసీఎంఈ బాధ్యతల స్వీకరణ


కె.షర్మిలాఅశోకా

 

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): జిల్లా ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ (డీసీఎంఈ)గా కె.షర్మిలాఅశోకా రాజమహేంద్రవరంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు-1 ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేసిన ఆమె ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్సుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. మెకానికల్‌ విభాగం సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బస్సుల్లో యాంత్రిక లోపాలు, ఇతర సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని