పకడ్బందీగా లబ్ధిదారుల సర్వే
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

పకడ్బందీగా లబ్ధిదారుల సర్వే


కరపలో వివరాల నమోదు పరిశీలిస్తున్న ఆర్డీవో

 

కరప: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ సూచించారు. కరప గ్రామ సచివాలయాన్ని శుక్రవారం సందర్శించి ఈ పథకానికి సంబంధించివివరాల నమోదుపై సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్తు కార్యాలయంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మండల, గ్రామస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దారు శ్రీనివాసరావు, ఎంపీడీవో కె.స్వప్న, గృహనిర్మాణశాఖ డీఏ గుప్తా, ఏఈ సోమిరెడ్డి, ఆర్‌ఐ మాచరరావు తదితరులు పాల్గొన్నారు.

సర్పవరంజంక్షన్‌: కాకినాడ గ్రామీణ మండలంలో 16,083 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, వెంటనే లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ జేడీ, మండల ప్రత్యేక అధికారి విజయకుమార్‌ తెలిపారు. కాకినాడ గ్రామీణం సర్పవరంజంక్షన్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో నారాయణమూర్తి అధ్యక్షతన జేడీఏ ముఖ్యఅతిథిగా ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. విజయకుమార్‌ మాట్లాడుతూ గృహనిర్మాణాలకు అవసరమైన సామగ్రి లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డీఈ శ్రీనివాస్‌, తహసీల్దారు మొరార్జీ, ఈవోపీఆర్డీ భాస్కరరావు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని