శంకరన్‌ జీవితం ఆదర్శం
eenadu telugu news
Published : 23/10/2021 02:31 IST

శంకరన్‌ జీవితం ఆదర్శం


శంకరన్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నేటి తరానికి దివంగత ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ జీవితం ఆదర్శమని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అన్నారు. శుక్రవారం సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆధ్వర్యంలో శంకరన్‌ జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహిచారు. ఆయన విగ్రహానికి కలెక్టర్‌ హరికిరణ్‌, సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీశ, డీఆర్వో సత్తిబాబు, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు నక్కా చిట్టిబాబు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేదల కోసం జీవితాన్ని దారపోసిన మహానీయుడు శంకరన్‌ అని కొనియాడారు. తమిళనాడులో జన్మించిన ఆయన ఒక అభ్యుదయవాది అన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ వైడీ రామారావు, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథ్‌, ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్‌, న్యాయవాది జవహర్‌ అలీ, పిట్టా వరప్రసాద్‌, తోకల ప్రసాద్‌, డోకుబుర్ర భద్రం, టి.నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని