సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
eenadu telugu news
Published : 23/10/2021 02:31 IST

సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహనరావు అన్నారు. ఏలూరు రేంజి కార్యాలయంలో శుక్రవారం సంక్షేమ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను, సమస్యలను పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేంజి పరిధిలోని కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాలకు సంబంధించిన పోలీసు సిబ్బంది మినిస్టీరియల్‌ ఉద్యోగులు పలువురు హాజరై వినతిపత్రాలు సమర్పించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని