11,303 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
logo
Published : 17/05/2021 05:56 IST

11,303 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నట్లు పౌరసరఫరాల డీఎం జయంతి తెలిపారు. డీఎం మాట్లాడుతూ మొత్తం 69 కొనుగోలు కేంద్రాల ద్వారా 863 మంది రైతుల నుంచి 11,303 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. రైతులకు రూ.10.67 కోట్లు చెల్లించినట్లు వివరించారు. గ్రేడ్‌-ఎ రకం 75 కేజీల బస్తాకు రూ.1416, సాధారణ రకానికి బస్తాకు రూ.1401 చెల్లిస్తున్నట్లు తెలిపారు. 69 ధాన్యం కొనుగోలు కేంద్రాలను 559 ఆర్‌బీకేలకు అనుసంధానం చేశామన్నారు. నరసరావుపేట, గురజాల డివిజన్లలో రైతులు పండించిన అంకుర్‌ సోనా ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం విక్రయంలో ఎలాంటి ఇబ్బందులొచ్చినా రైతులు కంట్రోల్‌ రూం నంబర్‌ 94913 92717కు ఫోన్‌ చేయాలని సూచించారు. బాపట్ల ప్రాంతంలో ఖరీఫ్‌లో పండించిన ధాన్యాన్ని వారం రోజుల్లో విక్రయించాలన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అన్నదాతలు ఉపయోగించుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని