మృతదేహాల తరలింపునకు ఉచిత వాహనాలు
logo
Published : 17/05/2021 05:56 IST

మృతదేహాల తరలింపునకు ఉచిత వాహనాలు


సిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి

నరసరావుపేట పట్టణం: కొవిడ్‌ మృతదేహాలు తరలించేందుకు ఉచిత వాహనాల సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ఉచిత వాహనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. వాహనాల్లో విధులు నిర్వహించే సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాతో మరణించిన మృతదేహాలను ఉచితంగా తరలించాలని బాధితుల నుంచి ఒక్క రూపాయి తీసుకోవద్దని సూచించారు. వాహనాలకు నెలవారీ అద్దె పురపాలక సంఘం చెల్లిస్తుందని తెలిపారు. ఇళ్ల వద్దనే ఉంటూ చనిపోయిన వారి మృతదేహాలను శ్మశాన వాటికలకు ఉచితంగా తరలిస్తారన్నారు. ఒక్కో వాహనంలో ఇద్దరు సిబ్బంది ఉంటారని ఒక స్ట్రెచర్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. 200 పడకల కొవిడ్‌ ఆసుపత్రిలో 200 మంది ఉన్నారని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో మరో 200 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నామన్నారు. జిల్లాకు 70 టన్నుల ఆక్సిజన్‌ వచ్చిందని నరసరావుపేటలో మరో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని, చనిపోయిన వారికి ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామన్నారు. కమిషనర్‌ రామచంద్రారెడ్డి, డీఈ శ్రీనివాసరావు, వైకాపా నేతలు మిట్టపల్లి రమేష్‌, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని