గాయత్రి మంత్ర జపంతో లోకానికి శాంతి
logo
Published : 17/05/2021 05:56 IST

గాయత్రి మంత్ర జపంతో లోకానికి శాంతి

గుంటూరు, న్యూస్‌టుడే: గాయత్రి మంత్ర అనుష్టానం చేసిన జపం ద్వారా లోకానికి శాంతి చేకూరుతుందని ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు వేకంట శ్రీధర్‌ శర్మ పేర్కొన్నారు. కరోనా నివారణార్థం లోకహితం కోసం సహస్ర గాయత్రి మంత్ర జపాన్ని ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చక, పురోహిత సంఘాల ఆధ్వర్యంలో ఎవరి ఇళ్లల్లో వారు పలు ప్రాంతాల్లో ఒకేసారి గాయత్రీ జప యజ్ఞం చేశారు. శ్రీధర్‌ శర్మ మాట్లాడుతూ మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో గాయత్రి జపం చేస్తే పంచభూతాల వల్ల భయం ఉండదని, అకాల మరణాలు ఉండవని వ్యాస భగవానుడు రాశారని తెలిపారు. మంత్రాన్ని అనుష్టానం చేసి జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని రుగ్వేదంలో పేర్కొన్నారని వివరించారు. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఏకకాలంలో 1008 సార్లు చేశామని వివరించారు. దీని ద్వారా లోకానికి శాంతి చేకూరుతుందని, ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జంధ్యాల రామలింగేశ్వరశాస్త్రి, మేడూరి శ్రీనివాసమూర్తి, నెమలికంటి హనుమంతురావు, అగస్త్య శాస్త్రి, పవన్‌కుమార్‌ శర్మ, దుర్గాప్రసాద్‌, కుందుర్తి భాస్కర్‌ శర్మ, మర్రిపాటి ప్రసాద్‌, శబరి, ప్రసాద్‌, సీతారమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని