ఎంపీపైనే జులుం ప్రదర్శిస్తే.. సామాన్యుల గతేంటి?
logo
Published : 17/05/2021 05:56 IST

ఎంపీపైనే జులుం ప్రదర్శిస్తే.. సామాన్యుల గతేంటి?

గుంటూరు, న్యూస్‌టుడే: ఎంపీ రఘురామకృష్ణరాజుపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయించిందే గాక థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర నేరమని, ఆయన ప్రాణాలకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘అదుపులోకి తీసుకున్న ఎంపీని పోలీసులు ఏవిధంగా శారీరక హింసకు గురి చేస్తారు? కరోనా నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు గుంపులుగా వెళ్లి అరెస్టు చేయడమే పెద్ద నేరం. కస్డడీలో ఉన్న సామాన్య పౌరుడ్ని కూడా కొట్టే హక్కు పోలీసులకు ఉండదని చట్టం చెబుతుంది. ఏపీ పోలీసులకు చట్టం నుంచి ఏమైనా మినహాయింపు ఉందా?’ అని ప్రశ్నించారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి పైనే పోలీసులు ఈవిధంగా జులుం ప్రదర్శించారంటే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం కావడంలేదన్నారు. ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా హడావుడిగా జిల్లా జైలుకు తరలించడం చట్ట విరుద్ధమన్నారు. ఇటువంటి చర్యలను తెదేపా ఖండిస్తుందని, మానవ హక్కుల సంఘాలు, మేధావులు ఈ ఘటనపై స్పందించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని