రెమ్‌డెసివిర్‌ విక్రయ ముఠా గుట్టురట్టు
logo
Published : 17/05/2021 05:56 IST

రెమ్‌డెసివిర్‌ విక్రయ ముఠా గుట్టురట్టు

గుంటూరు: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా రెమ్‌డెసివిర్‌ సూదిమందు అమ్ముతున్న ముఠాని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వలపన్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ విభాగం సహాయ సంచాలకులు అనిల్‌ కుమార్‌ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు నర్సులు రెమ్‌డెసివిర్‌ సూదిమందు అమ్ముతున్నారనే అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తమ శాఖకు చెందిన ఉద్యోగులు రెండు బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకున్నారన్నారు. గుంటూరులో హోమ్‌ కేర్‌ నర్సుగా పని చేస్తున్న జి.వెంకట అన్వేశ్‌, పీపుల్స్‌ ట్రామా ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న టి.సువర్ణకుమార్‌, ఉదయ్‌ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న బి.వెంకట్‌లు రెమ్‌డెసివిర్‌ సూదిమందును రూ.25 వేలకు విక్రయిస్తుండగా పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి నాలుగు ఇంజెక్షన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకుని ఔషధ నియంత్రణ చట్టం నిబంధనల మేర విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని