జ్వరాల సర్వేపై సిబ్బందికిఅవగాహన కల్పించాలి
logo
Published : 17/05/2021 05:56 IST

జ్వరాల సర్వేపై సిబ్బందికిఅవగాహన కల్పించాలి


తిమ్మాపురంలో సర్వే సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ ప్రశాంతి, అధికారులు

యడ్లపాడు, న్యూస్‌టుడే: జ్వరాల సర్వేపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి సరైన అవగాహన లేదని, దానిపై వారికి అవగాహన కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. యడ్లపాడు, తిమ్మాపురం గ్రామాల్లో ఆదివారం నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుంటే వెంటనే వారికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించి మెడికల్‌ కిట్‌ ఇవ్వాలన్నారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారికి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, ఆసుపత్రికి తరలించాలన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్న వాలంటీర్లు, ఆశా కార్యకర్తలకు వివరంగా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ జె.శ్రీనివాసరావు, ఎంపీడీవో మాధురి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని