కొవిడ్‌ వైద్య సేవలకు సహకారం
logo
Published : 17/05/2021 05:56 IST

కొవిడ్‌ వైద్య సేవలకు సహకారం


ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ను జేసీ ప్రశాంతికి అందజేస్తున్న డ్రావిన్‌ ఫార్మా సంస్థ ప్రతినిధులు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: కొవిడ్‌ రోగులకు మెరుగైన వైద్యసేవలు కొనసాగించేందుకు డ్రావిన్‌ ఫార్మా సంస్థ సహకారం అందించింది. సుమారు రూ.9 లక్షల విలువ చేసే 6 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను జిల్లా సంయుక్త పాలనాధికారి(సచివాలయాలు, అభివృద్ధి) పి.ప్రశాంతికి ఆ సంస్థ ప్రతినిధులు డాక్టర్‌ ఎస్‌.రవికుమార్‌, ఎన్‌.మురళి, ఎస్‌.రత్నారెడ్డి, వి.రమేష్‌బాబులు ఆదివారం అందజేశారు. వీటిని పెదకూరపాడు, ప్రత్తిపాడు మండలాల్లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లలో మూడు చొప్పున ఆక్సిజన్‌ అవసరమైన కొవిడ్‌ రోగులకు వినియోగించాలని, వీటిని తహసీల్దార్‌లకు అందజేశారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ అందించిన వైద్యులను జేసీ ప్రశాంతి ప్రత్యేకంగా అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని