భార్య గొంతుకోసిన భర్త
logo
Published : 17/05/2021 05:56 IST

భార్య గొంతుకోసిన భర్త


నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసిన స్థానికులు

బోయపాలెం(యడ్లపాడు), న్యూస్‌టుడే: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై దాడి చేసి గొంతు కోశాడు. పోలీసుల కథనం మేరకు... ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫోపున్‌ గనూన్‌, రీటా దంపతులు గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలోని ఓ నూలుమిల్లులో గత కొన్ని రోజుల నుంచి కార్మికులుగా పని చేస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న గనూన్‌ తరచూ ఆమెను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు ఆదివారం బోయపాలెం కూడలికి వచ్చారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంతో గనూన్‌ భార్యపై దాడి చేసి బ్లేడుతో గొంతు కోశాడు. స్థానికులు గనూన్‌ను పట్టుకుని విద్యుత్తు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై రాంబాబు సంఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. క్షతగాత్రురాలిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బాధితురాలు రీటా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని