కొవిడ్‌ సంరక్షణ కేంద్రానికి ప్రవాసాంధ్రుల సాయం
logo
Published : 17/05/2021 05:56 IST

కొవిడ్‌ సంరక్షణ కేంద్రానికి ప్రవాసాంధ్రుల సాయం


వార్డులో ఏర్పాటు చేసిన బెడ్స్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ, న్యూస్‌టుడే: అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఎంపవర్‌ అండ్‌ ఎక్సైల్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ ఆయేషా చారగుల్ల, ఇండియా చాఫ్టర్‌ హెడ్‌ కరణం కల్యాణ్‌ కృష్ణకుమార్‌ వినుకొండ కొవిడ్‌ సంరక్షణ కేంద్రానికి రూ.2 లక్షల విలువైన 30 మంచాలు, పరుపులను అందించారు. ఆదివారం వాటిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కేంద్రం అధికారులకు అప్పగించారు. జన్మభూమిపై మమకారంతో సాయం అందించిన వారితో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఒప్పించి వాటికి కేంద్రానికి తెచ్చిన తహశీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఆర్‌ఐ జానిబాషా, ఆ సంస్థ ప్రతినిధి వాసిరెడ్డి రవిచంద్రను ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేసిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ షేక్‌ దస్తగిరి, వైఎస్‌ ఛైర్మన్‌ రాజేష్‌ఖన్నా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని