వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు మెండు
logo
Published : 17/05/2021 05:56 IST

వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు మెండు


వెబినార్‌ ద్వారా మాట్లాడుతున్న డాక్టర్‌ నరేంద్రసింగ్‌

 

పొన్నూరు, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజస్థాన్‌, ఉదయపూర్‌లోని మహారాణా ప్రతాప్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ నరేంద్రసింగ్‌ రాథోర్‌ పేర్కొన్నారు. ఆదివారం వడ్లమూడి వద్దనున్న విజ్ఞాన్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీలో 2021-22 విద్యాసంవత్సరం నుంచి 4 సంవత్సరాల బీఎస్సీ అగ్రికల్చర్‌ (ఆనర్స్‌) కోర్సును వెబినార్‌ ద్వారా ఆయన ప్రారంభించారు. సాంకేతిక తోడ్పాటుతో వ్యవసాయ రంగం నూతన విధానాలను అవలంబిస్తోందన్నారు. ఈ రంగానికి సంబంధించిన కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు రానున్న కాలంలో విపరీతమైన డిమాండ్‌ ఉంటుందన్నారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ కార్పొరేట్‌ కొలువులు సైతం నేటి యువత వదులుకుని పల్లెబాట పడుతున్నారని, ఇది గొప్ప పరిణామమన్నారు. అగ్రికల్చర్‌ కోర్సును అభ్యసిస్తున్న చివరి సంవత్సరం విద్యార్థులను ఇంటర్నషిప్‌ కోసం ఒక సంవత్సరం పాటు గ్రామాలకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉప కులపతి డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, అగ్రికల్చర్‌ విభాగ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని