డెల్టా కాల్వలకు నీటి విడుదల
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

డెల్టా కాల్వలకు నీటి విడుదల


దుగ్గిరాల: కొమ్మమూరు కాల్వకు విడుదలైన నీరు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: పశ్చిమ డెల్టా కాల్వలకు మంగళవారం 3,920 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇందులో తూర్పు కాల్వకు 600, పశ్చిమ కాల్వకు 280, నిజాంపట్నం ఛానల్‌కు 250, రేపల్లె కాల్వకు 1,000, పెదవడ్లపూడి ఉన్నత వాహినికి 250, కొమ్మమూరు కాల్వకు 1,500 క్యూసెక్కులు పంపిణీ చేస్తున్నారు. కాగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం 12 అడుగులు ఉంది. అక్కడి నుంచి నదిలోకి 2,32,750 క్యూసెక్కులు ఇస్తున్నారు. వాస్తవంగా కాల్వలకు 3,920 క్యూసెక్కులని చెబుతున్నా అనధికారికంగా కొంత ఎక్కువే ఇస్తున్నట్లు సమాచారం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని