దిగువకు 31,056 క్యూసెక్కుల ప్రవాహం
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

దిగువకు 31,056 క్యూసెక్కుల ప్రవాహం


ప్రాజెక్టులో నిండుగా నీరు

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే : కృష్ణా ఎగువ పరివాహ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దిగువ జలాశయాలకు నీటి చేరిక తగ్గుతోంది. దీంతో సాగర్‌ జలాశయం నుంచి నాలుగు క్రస్టుగేట్లు 5 అడుగులు ఎత్తి 31,056 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, రోజా జలాశయాల నుంచి శ్రీశైల జలాశయానికి 2,40,991 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 1,41,068 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నీటిమట్టం 884.40 అడుగుల చేరి గరిష్ఠస్థాయి వద్ద ఉంది. ఇది 212.4385 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్‌ నీటిమట్టం 856.80 అడుగులకు పెరిగింది. ఇది 304.4680 టీఎంసీలకు సమానంగా ఉంది. ఎడమ కాల్వకు 601, సాగర్‌ ప్రధాన జల విద్యుత్తు కేంద్రానికి 34,916, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 1800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయాలకు నీటి చేరిక తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కృష్ణా బేసిన్‌లోని జలాశయాలైన ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, రోజా, హంద్రి, తుంగభద్ర, శ్రీశైలం, సాగర్‌ గరిష్ఠస్థాయికి చేరువ కావడంతో వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని