దాచేపల్లి యార్డులో విక్రయాలకు సహకరించండి
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

దాచేపల్లి యార్డులో విక్రయాలకు సహకరించండి

మిర్చియార్డు, న్యూస్‌టుడే: దాచేపల్లి మార్కెట్‌ యార్డులో మిర్చి క్రయవిక్రయాలకు సహకరించాలని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కోరారు. గుంటూరు మిర్చియార్డులో ఆయన మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపార సంఘాల నాయకులతో మంగళవారం సమావేశమై చర్చించారు. దాచేపల్లి మార్కెట్‌ యార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అక్కడా మిర్చి లావాదేవీలు నిర్వహించాలని కోరారు. మిర్చి సీజన్‌లో గుంటూరు మిర్చియార్డుపై భారం తగ్గుతుందని చెప్పారు. దాచేపల్లి యార్డును మొదటి విడతగా అయిదు ఎకరాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కమీషన్‌ ఏజెంట్లు, ఎగుమతి వ్యాపారులు సీజన్‌లో అక్కడకు వచ్చి రైతుల వద్ద విక్రయాలు జరిపితే బాగుంటుందన్నారు. కమీషన్‌ ఏజెంట్లు స్పందిస్తూ ఇక్కడ నుంచి తాము అక్కడకు వచ్చి కార్యకలాపాలు కొనసాగించే కంటే అక్కడే షాపులు ఏర్పాటు చేసి 50 మంది కమీషన్‌ ఏజెంట్లకు లైసెన్స్‌లు ఇప్పిస్తే బాగుంటుందన్నారు. ఇందుకు తాము సహకారం అందజేస్తామన్నారు. గోదాములు, శీతలగిడ్డంగులు నిర్మించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని