పట్టుతప్పితేప్రమాదమే..
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

పట్టుతప్పితేప్రమాదమే..

ప్రముఖ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్‌కు ఏటా పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ఇక్కడ ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే. సాగర్‌ డ్యాం ఎదురుగానున్న రహదారి 2019లో వచ్చిన భారీ వరదలకు కొట్టుకుపోయింది. గత ఏడాది కొత్తగా రహదారి వేశారు కానీ రివిట్‌మెంట్‌ చేయలేదు. ప్రస్తుతం ఈ రహదారి అంచులు జారిపోయి ప్రమాదకరంగా కనిపిస్తుంది. వరద తీవ్రత కొనసాగితే రహదారి కొట్టుకుపోయే అవకాశం ఉంది. అధికారులు ముందే మేల్కొంటే రహదారిని పరిరక్షించడంతో పాటు పర్యాటకులకు ముప్పు తొలగించినవారవుతారు. - ఈనాడు గుంటూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని