మిర్చియార్డులో జోరుగా క్రయవిక్రయాలు
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

మిర్చియార్డులో జోరుగా క్రయవిక్రయాలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. యార్డుకు వచ్చిన బస్తాల కంటే విక్రయాలు జరిగినవి అధికంగా ఉన్నాయి. మంగళవారం రైతులు మొత్తం 55,226 బస్తాలు యార్డుకు తరలించారు. గత నిల్వలతో కలిపి 57,446 బస్తాలు క్రయవిక్రయాలు జరిగాయి. క్రయవిక్రయాలు ముగిసే సమయానికి యార్డులో 10,560 బస్తాలు నిల్వ ఉన్నాయి. డీలక్స్‌ రకాల మార్కెట్ నిలకడగా ఉంది. నాణ్యత కలిగిన తేజ రకం మిర్చికి డిమాండ్‌ పలికింది. రూ.200 వరకు ధర పెరిగిందని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. 334, సూపర్‌ 10 రకాల మిర్చి మార్కెట్ బాగానే నడచింది. నాన్‌ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి రూ.14,300, తేజ రూ.7,000 నుంచి రూ.15,600, బాడిగ రూ.8,000 నుంచి రూ.17,000, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.8,700 ధర లభించింది. ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి రూ.14,500, స్పెషల్‌ వెరైటీ తేజ రకానికి రూ.7,500 నుంచి రూ.16,000, బాడిగ రూ.8,500 నుంచి రూ.16,500, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.8,000 ధర లభించింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని