ప్రేమికుడు పెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్య
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

ప్రేమికుడు పెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్య

కొచ్చెర్లతండా(ఈపూరు), న్యూస్‌టుడే: ప్రేమించిన వాడు పెళ్లికి అంగీకరించలేదని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఈపూరు మండలం కొచ్చెర్ల తండాలో జరిగింది. గ్రామానికి చెందిన యువతి(23)కి గంగుపల్లితండాకు చెందిన మేరాజోత్‌ అంజానాయక్‌తో పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి యువతీ యువకులిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 2న కోటప్పకొండ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో గాని యువతి ఇంటికొచ్చి పురుగుల మందు తాగింది. అనంతరం నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం వేకువన మృతి చెందింది. ప్రేమించిన వాడు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపంతో తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఎస్సై వెంకటరావు కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని