వనమహోత్సవంలో 5 కోట్ల మొక్కలు
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

వనమహోత్సవంలో 5 కోట్ల మొక్కలు


ఎయిమ్స్‌ ఆవరణలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి,
చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చిత్రంలో ఎమ్మెల్యే ఆర్కే, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవంలో 5 కోట్ల మొక్కలు నాటడానికి సమాయత్తమైనట్లు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎయిమ్స్‌ ఆవరణలో గురువారం సీఎం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి ఆయన బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి బాలినేని మాట్లాడుతూ పర్యావరణం, పచ్చదనంలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. త్వరలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తెస్తామన్నారు. రాష్ట్రంలో 22 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పర్యావరణ రక్షణలో కీలక పాత్ర వహించే మొక్కలు ఆదాయాన్నీ ఇస్తున్నాయన్నారు. గోదావరి జిల్లాల్లో కొబ్బరి మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి విజయకుమార్‌, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని