కుడి జల విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

కుడి జల విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం


స్విచ్‌ ఆన్‌ చేసి జల విద్యుత్తు కేంద్రానికి నీటి విడుదల చేస్తున్న ఎమ్మెల్యే

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: సాగర్‌ నీటి విషయంలో పక్క రాష్ట్రంతో చిన్న సమస్యలున్నా సమన్వయంతో ముందుకు వెళతామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం కుడి జల విద్యుత్తు కేంద్రంలో స్విచ్‌ ఆన్‌చేసి ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం సాగర్‌ మిగులు జలాలను విద్యుత్తు ఉత్పత్తి అనంతరం కుడికాల్వకు విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించినట్లు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం ఆగస్టు 15న, సాగునీటి అవసరాలకు సెప్టెంబరు ఒకటిన కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తారని చెప్పారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేళ్లు సాగర్‌ జలాశయం నిండటం శుభపరిణామమన్నారు. ఆయన వెంట వైకాపా రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరరామిరెడ్డి, కుడి కాల్వ సీఈ ఎం.శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఈ పురుషోత్తమ్‌ గంగరాజు, ఈఈ వై.శ్రీహరి, డీఈ వైఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, డీఈలు లింగమూర్తి, వెంకటసుబ్బయ్య ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని