చేయి చేయి కలిపి.. ఐక్యంగా నిలిచి
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

చేయి చేయి కలిపి.. ఐక్యంగా నిలిచి


రైతులు ఏర్పాటు చేసుకున్న రహదారి

నడింపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే : ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడక రైతులు ఐక్యంగా ఏర్పడి తమ సమస్యను తామే పరిష్కరించుకున్నారు. చెరుకుపల్లి మండలం నడింపల్లి బాడవ పొలాల్లోకి వెళ్లే మట్టిగాలు రోడ్డు చినుకు పడగానే గుంతలమయంగా మారి వ్యవసాయ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రహదారిని అభివృద్ధి పరచాలని పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో నడింపల్లి గ్రామ రైతులు ముందుకు వచ్చారు. నాలుగు రోజులు కష్టపడి పాత భవనాల శిథిలాలను, రాయిముక్కలను గుంతల్లో వేసి చదును చేశారు. తొలగించిన భవనాల్లోని సున్నం పొడితో రహదారిని ఏర్పాటు చేశారు. యంత్రం సాయంతో రాయిముక్కను చదును చేయించి ఈ సీజన్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని