రైతుల సేవకు ప్రాధాన్యం
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

రైతుల సేవకు ప్రాధాన్యం


కలెక్టరు వివేక్‌ యాదవ్‌ను కలిసిన డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి, సభ్యులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో రైతులకు సేవ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ వై.భాగ్యలక్ష్మి అన్నారు. గుంటూరులోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం ఆమె అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2020-21 రబీ సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లాలో 119 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.689 కోట్ల విలువైన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసిందని తెలిపారు. ఏపీ మార్క్‌ఫెడ్‌ 31 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.66 కోట్ల విలువైన తెల్లజొన్నలు, మొక్కజొన్నలు కొనుగోలు చేసిందన్నారు. 44 బ్రాంచీల ద్వారా రైతులకు సరఫరా చేసిన ఎరువులు, విత్తనాల లావాదేవీలపై సమీక్షించారు. ఏటుకూరు రోడ్డులోని గోదాముల సముదాయానికి మరమ్మతు చేసేందుకు ఆమోదించారు. సమావేశం అనంతరం భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులు జిల్లా కలెక్టరు వివేక్‌ యాదవ్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని