రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: గూడ్స్‌ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి పిడుగురాళ్ల పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి ప్రజాశక్తినగర్‌ సమీపంలోని రైల్వే వంతెన వద్ద గూడ్స్‌ రైలు కింద పడి చనిపోయాడు. మృతుని చేతిపై మరియమ్మ అని పచ్చబొట్టు ఉంది. నడికూడి రైల్వే ఎస్సై శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వయసు 45 సంవత్సరాలు ఉంటుందని, తెలుపు రంగు ప్యాంట్‌, ఎరుపు చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని