రెండు గేట్ల నుంచి నీటి విడుదల
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

రెండు గేట్ల నుంచి నీటి విడుదల


గేట్ల నుంచి దిగువకు వస్తున్న నీరు 

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ డ్యాం రెండు క్రస్టుగేట్లను 5 అడుగులు ఎత్తి 15,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నీటిమట్టం 588.90 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 308.7614 టీఎంసీలకు సమానం. సాగర్‌ కుడి జల విద్యుత్తు కేంద్రం నుంచి ఉత్పాదన అనంతరం కుడి కాల్వకు 952 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు 1800, ప్రధాన జల విద్యుత్తు కేంద్రానికి 34060, ఎడమ కాల్వకు 1043 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైల నీటిమట్టం 884.50 అడుగులకు చేరి గరిష్ఠ స్థాయి వద్ద తొణికిసలాడుతోంది. ఇది 212.9198 టీఎంసీలకు సమానం. 
కుడికాల్వ నాలుగో గేటు నుంచి నీరు లీకు 
విజయపురిసౌత్, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ కుడి కాల్వ నాలుగో గేటు నుంచి నీరు లీకవుతోంది. అయిదో గేటులో కూడా స్వల్పంగా సమస్య ఉంది. నిరుడు కుడి కాల్వ తొమ్మిదో క్రస్ట్‌గేటు నుంచి నీరు లీకైంది. అనంతరం దానికి మరమ్మతులు చేపట్టారు. మిగిలిన గేట్లకు కూడా మరమ్మతులు చేయాలని నిపుణులు సూచించినా పనులు కాలేదు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని