జికా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

జికా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జికా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ బుధవారం డీఎంహెచ్‌వో, డీఎంవోలకు సూచించారు. గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జికా కేసులు నమోదైన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. ఆ వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. జికాకు మూలం దోమలు కాబట్టి, అవి వృద్ధి చెందకుండా చూసుకుంటే.. దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని