రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యం
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యం


మాట్లాడుతున్న జేసీ దినేష్‌కుమార్‌

మాచర్లగ్రామీణ, దాచేపల్లి, న్యూస్‌టుడే: భూ విషయాల్లో రైతుల ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, దీనికోసం గ్రామస్థాయిలోనే అధికారులతో గ్రామసభలు నిర్వహిస్తామని జేసీ దినేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం మార్కెట్‌యార్డులో జరిగిన భూమి నోషనల్‌ ఖాతాల క్రమబద్ధీకరణ అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. రెవెన్యూశాఖలో ప్రతి రికార్డు, పత్రాలు ఏళ్లు గడిచేకొద్ది సంఖ్యలు, పేర్లు మార్చి అక్రమాలకు పాల్పడే అవకాశముందనే ఉద్దేశంతో వాటిని కంప్యూటరీకరణ చేశారన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో 1బి రికార్డులను ప్రదర్శించాలన్నారు. రైతులు తమపేర్లు ఉన్నాయా లేదా అనేది పరిశీలించుకోవచ్చన్నారు. మాచర్లలో 3,800 నోషనల్‌ ఖాతాలు రెండు వేల ఎకరాల్లో ఉన్నాయన్నారు. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల సౌకర్యార్ధం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గురజాల ఆర్డీవో పార్ధసారధి, తహశీల్దారు కేశవనారాయణ, వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాల తనిఖీ..: మాచర్ల పట్టణంలోని జెండాచెట్టు ప్రాంతంలోని రెండు వార్డు సచివాలయాలను జేసీ దినేష్‌కుమార్‌ బుధవారం తనిఖీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. జేసీ వెంట పురపాలక కమిషనర్‌ గిరికుమార్, రమణబాబు తదితరులు ఉన్నారు. దాచేపల్లి మండలం అలుగుమల్లెపాడు గ్రామాన్ని బుధవారం జేసీ దినేష్‌కుమార్‌ సందర్శించి అక్కడ జరుగుతున్న సమగ్ర భూసర్వే అమలు తీరును పరిశీలించారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని