రాయితీ యంత్ర పరికరాలు మంజూరు చేయండి
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

రాయితీ యంత్ర పరికరాలు మంజూరు చేయండి


రైతులతో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ‘వ్యవసాయ యంత్ర సేవా కేంద్రాల్లో బాడుగకు యంత్ర పరికరాలు అందజేయకుండా గతంలో మాదిరిగా రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అర్హులైన ప్రతి రైతుకు మంజూరు చేయండి సారూ..’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ను రైతులు కోరారు. కంటెపూడిలోని రైతు భరోసా కేంద్రాన్ని, వరి పైర్లను బుధవారం ఆయన పరిశీలించారు. రైతు భరోసా కేంద్రంలో సేవలు, వివిధ పంటల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అనేక సమస్యలను రైతులు ఏకరువు పెట్టారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయాలని కోరారు. పత్తిలో గులాబిరంగు పురుగు ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఏర్పాటు చేసే లింగాకర్షక బుట్టలను అధిక మొత్తంలో రాయితీపై కేటాయించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ద్రవ జీవామృతం తయారీని గమనించారు. రైతు భరోసా కేంద్రంలో ఎరువులను నిల్వ చేయకుండా ప్రత్యేకంగా గోదాములను అద్దెకు తీసుకోవాలని అధికారులకు కమిషనర్‌ సూచించారు. ఏడీఏ కె.అమలకుమారి, ఏవో ఎస్‌.శ్రీధర్‌రెడ్డి, వీఏఏలు జె.యేసోబు, మనోజ్‌కుమార్‌, ఉప సర్పంచి రాధాకృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని