ఈ-రవాణా పర్మిట్‌కుసహకరించకపోతే చర్యలు
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

ఈ-రవాణా పర్మిట్‌కుసహకరించకపోతే చర్యలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: ఈ-రవాణా పర్మిట్‌ విధానానికి మిర్చి వ్యాపారులు సహకరించకపోతే చర్యలు తప్పవని మిర్చియార్డు కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ-రవాణా పర్మిఫట్‌ను ప్రస్తుతానికి వాయిదా వేయాలని మిర్చి ఎగుమతి అసోసియేషన్‌ నాయకులు కార్యదర్శిని కలిసి కోరారు. మూడు నెలల పాటు సాధారణ పద్ధతినే అనుమతించాలన్నారు. దీనికి కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, మార్కెటింగ్‌ కమిషనరేట్‌ నుంచి ఉత్తర్వులు ఉన్నాయన్నారు. ఈ విధానాన్ని అమలు చేయాల్సిందేనని వ్యాపారులకు తెలియజేశారు. ఈ-రవాణా పర్మిట్‌ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పర్మిట్‌ పుస్తకాన్ని సంబంధిత సూపర్‌వైజర్‌కు అందజేసి స్టాక్‌ వివరాలను లెటర్‌ ప్యాడ్‌పై పొందుపర్చి ఈ-నామ్‌ ఐడీని కార్యాలయంలో రిజిస్టర్‌ చేసుకుని ఆన్‌లైన్‌ ద్వారా పర్మిట్‌ పొందాలని సూచించారు. వ్యాపారులు వద్ద ఉన్న పర్మిట్‌ పుస్తకాన్ని వినియోగించవద్దన్నారు. కొత్త విధానానికి సహకరించని వ్యాపారుల లైసెన్స్‌లను అవసరమైతే హోల్డ్‌లో పెట్టేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని