సర్పంచుల గౌరవ వేతనాన్ని పెంచాలి
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

సర్పంచుల గౌరవ వేతనాన్ని పెంచాలి

పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం


మన్నెం సుజాతను సత్కరిస్తున్న పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు తదితరులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని ఏపీ పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఉండవల్లిలో బుధవారం జరిగిన ఈ సమావేశానికి పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో 13,340మంది సర్పంచులున్నారని, కొన్నేళ్లుగా రూ.3 వేల వేతనమే ఇస్తున్నారని, రూ.10 వేలకు పెంచుతూ జీవో విడుదల చేయాలని తీర్మానించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన 29 విశేష అంశాలు సర్పంచుల పర్యవేక్షణలోనే జరగాలని సమావేశం నిర్ణయించింది.15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ తలసరి గ్రాంట్‌, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌, సీనరేజీ, రిజిస్ట్రేషన్‌ స్టాంపు డ్యూటీ నిధులు గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ మంత్రులకు లేఖ ద్వారా తెలియజేయాలని సమావేశం తీర్మానించింది. అంతకుముందు కొవిడ్‌తో మృతి చెందిన సర్పంచులకు కార్యవర్గం నివాళులర్పించింది. అనంతరం తదుపరి సర్పంచుల పదవుల్లో విశేష ప్రతిభ చూపిన మాజీ సర్పంచులు, గుంటూరు జిల్లా ఎస్సీ సర్పంచుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు మన్నెం సుజాతకిశోర్‌ను ఘనంగా సత్కరించారు. పంచాయతీ పరిషత్‌ అధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, కుంచె వెంకటరంగారావు, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు కాటూరి శ్రీనివాసరావు, జిల్లా సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షులు మన్నెం కిషోర్‌, ఎలీషా, కృష్ణమోహన్‌, షేక్‌ గౌస్‌ సంధాని తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని