‘ప్రభుత్వం కళ్లు తెరిపించేలా తెదేపా పోరాటం’
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

‘ప్రభుత్వం కళ్లు తెరిపించేలా తెదేపా పోరాటం’


సమావేశంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు, అరవిందబాబు తదితరులు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు గర్జనలు చేపట్టనున్నామని తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ అని ప్రభుత్వం ప్రకటించినా అమలుకు నోచుకోలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ కనిపిస్తుందన్నారు. ఇప్పటికీ నాలుగువేల కోట్లు రైతులకు ధాన్యం బకాయిలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాసిరకం విత్తనాలు, బ్లాక్‌ మార్కెట్‌లు ఎక్కువయ్యాయని రైతులకు బీమా, రుణాలు సక్రమంగా అందటం లేదన్నారు. జగన్‌ ప్రభుత్వంలో రైతులకు నష్టాలే వచ్చాయన్నారు. రైతుభరోసా కేంద్రాలు వైకాపా నాయకుల కార్యాలయాలుగా మారాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కరెంట్‌ ఉత్పత్తి కోసం నీటిని వృథా చేస్తున్నా వైకాపా ప్రభుత్వం అడ్డుకోవటంలో విఫలమైందని పేర్కొన్నారు. చవితి ఉత్సవాలకు సంబంధించి పక్షపాత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే పుట్టిన రోజులకు వర్తించని కొవిడ్‌ నిబంధనలు దేవుడు కార్యక్రమాలకు వర్తిస్తాయా అని ప్రశ్నించారు. నియోజకవర్గ బాధ్యులు డాక్టర్‌ అరవిందబాబు, పార్టీ నేతలు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని