ఎస్సైపై గ్రామీణ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

ఎస్సైపై గ్రామీణ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: నరసరావుపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎస్సైపై ఓ ప్రైవేటు పైనాన్స్‌ సంస్థ మేనేజర్‌ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ సంస్థలో రుణం తీసుకున్న వ్యక్తి వాయిదాలు చెల్లించకుండా మరొకరి వద్ద తాకట్టు పెట్టిన వాహనాన్ని మేం సీజ్‌ చేసి గ్రామీణ స్టేషన్‌ ఎస్సైకి అప్పగిస్తే ఆయన ముడుపులు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని టీవీఎస్‌ క్రెడిట్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రతినిధులు గ్రామీణ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నరసరావుపేట మండలం కాకానిలో కారు ఉన్నట్లు గుర్తించి తమ సిబ్బంది వాహనం తీసుకొచ్చి రూరల్‌ స్టేషన్‌లో అప్పగిస్తే ఆ వాహనాన్ని స్టేషన్‌లో పని చేస్తున్న ఓ ఎస్సై అక్కడి నుంచి తప్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై ఆదేశాల మేరకు అక్కడే పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ కారును తీసుకెళ్లి యజమానికి అప్పగించాడని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై ఎస్పీ తక్షణం స్పందించి సదరు ఎస్సైను వీఆర్‌లోకి పంపుతూ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఓ ప్రజాప్రతినిధి ఎస్సైని కాపాడేందుకు ఫిర్యాదు చేసిన వారితో చర్చలు జరిపినట్లు తెలిసింది. గ్రామీణ ఎస్సైను వీఆర్‌లోకి పిలిచిన విషయమై డీఎస్పీ విజయభాస్కరరావును అడుగగా ఎస్సైపై ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ మేనేజర్‌ ఫిర్యాదు చేయటంతో ఎస్పీ ఆయన్ను వీఆర్‌లోకి పిలిచారని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని