24 నుంచి పీసెట్‌
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

24 నుంచి పీసెట్‌

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీసెట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. సెట్‌ ఏర్పాట్లపై ఛైర్మన్‌ ఆచార్య రాజశేఖర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్ష జరిపారు. ఈనెల 24, 25, 26, 27 తేదీల్లో పీసెట్‌ ఎంపికలు జరుగుతాయని కన్వీనర్‌ డాక్టర్‌ జాన్సన్‌ తెలిపారు. బీపీఈడీ, యూజీపీఈడీ కోర్సులకు 1857 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరంతా 19 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు రోజుకు పరిమిత సంఖ్యలోనే ఎంపికలు నిర్వహిస్తామన్నారు. మొదటి మూడు రోజులు పురుషులకు, చివరి రోజు మహిళలకు కేటాయించామన్నారు. తొలిరోజు 433, 25న 469, 26న 469, 27న 486 మంది విద్యార్థినులకు ఎంపికలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఇంజినీరు కుమార్‌రాజా, శివ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని