‘వైకాపా అరాచకాలను చంద్రబాబుకు వివరించా’
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

‘వైకాపా అరాచకాలను చంద్రబాబుకు వివరించా’

చంద్రబాబుతో మాట్లాడుతున్న యరపతినేని

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే : పల్నాడులో వైకాపా అరాచకాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం కలిసినట్లు పేర్కొన్నారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో ఏ వర్గానికి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించలేదని చెప్పినట్లు చెప్పారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలు ఇంత వరకు కేటాయించలేదని ఆయనకు వివరించినట్లు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెదేపా అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని