‘రాష్ట్రంలో రాక్షస పాలన’
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

‘రాష్ట్రంలో రాక్షస పాలన’

తెదేపా నేతల మండిపాటు ●

చంద్రబాబు ఇంటిపై దాడికి నిరసన


తెదేపా నేతలు బయటకు రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలిపేందుకు వస్తున్న తెదేపా నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటంతోశుక్రవారం తోపులాట చోటు చేసుకుంది. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గేటు మూసి బయటకు రాకుండా నిలిపివేశారు. దీంతో పోలీసులు, పార్టీ నేతల మద్య వాగ్వావాదం జరిగింది. పార్టీ కార్యకర్తలు గేటు నెట్టుకుని బయటకు వస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మరోసారి తోపులాట జరిగింది. డాక్టర్‌ అరవిందబాబును పోలీసు వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు డాక్టర్‌ అరవిందబాబు పట్ల దురుసుగా వ్యవహరించటంతో ఆయన కిందపడిపోయారు. నిరసన ప్రదర్శనను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని పోలీసులు నేతలను కార్యకర్తలను వెనక్కి పంపివేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డాక్టర్‌ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై వైకాపా నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని