సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగింపు
eenadu telugu news
Published : 20/09/2021 02:37 IST

సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగింపు


నరసరావుపేట ఎస్‌.ఎస్‌.ఎన్‌. డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపును

పరిశీలిస్తున్న గ్రామీణ ఎస్పీ విశాల్‌ గున్నీ

ఈనాడు, అమరావతి : జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ తర్వాత కొన్ని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో కొన్నిరోజుల పాటు బందోబస్తు కొనసాగించాలని నిర్ణయించామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో ఫలితాల వెల్లడి తర్వాత కూడా రెండు, మూడు రోజుల పాటు ఎస్సైల పర్యవేక్షణలో పోలీసు బృందాలు గ్రామాల్లోనే ఉంటాయని చెప్పారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో రూరల్‌ జిల్లా పోలీసుల పరిధిలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన అనంతరం నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల విధానంలో ఏర్పాటు చేసిన భద్రత సత్ఫలితాన్నిచ్చిందన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సుల వద్ద, లెక్కింపు కేంద్రంలో, కేంద్రానికి వంద మీటర్ల దూరంలో మొత్తం మూడంచెల్లో బందోబస్తును నియమించుకుని భద్రతను పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అనుసరనీయమని ఉన్నతాధికారుల నుంచి ప్రసంశలు వచ్చాయని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని