ఏఎన్‌యూ ఈసీ సమావేశం నేడు
eenadu telugu news
Published : 20/09/2021 02:37 IST

ఏఎన్‌యూ ఈసీ సమావేశం నేడు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పాలకమండలి సమావేశం సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరగనుంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వీసీ ఆచార్య రాజశేఖర్‌ అవినీతిపై ఇటీవల ప్రభుత్వం నియమించిన కమిటీ తుది నివేదికను ఉన్నత విద్యామండలికి సమర్పించింది. దీనిపై చర్చించే అవకాశమున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఒప్పంద అధ్యాపకుల జీతాల పెంపు, కారుణ్య నియామకాల అంశాలను ఎజెండాలో పెట్టినట్టు సమాచారం. విశ్వవిద్యాలయంలో ఎవరి అనుమతి లేకుండా ఐదుగురుని అతిథి అధ్యాపకులుగా తీసుకున్నారు. ఆచార్య రాజశేఖర్‌కు అనుకూలంగా ఉన్న వారికి అతిథి అధ్యాపకులుగా అవకాశం ఎలా ఇస్తారని ఇప్పటికే కొంతమంది పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్య్వూలు నిర్వహించకుండానే వారిని అతిథి అధ్యాపకులుగా నియమించడమేంటని ఈసీ సభ్యులు ప్రశ్నించే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఈసీ అనుమతి, జీవో నంబర్లు 18, 15, 114ను పరిగణనలోకి తీసుకోవడం, ఉర్దూ, అరబిక్‌ విభాగాల ఏర్పాటు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ను కెమీస్ట్రీ నుంచి తీసేసి ప్రత్యేక విభాగంగా గుర్తింపు, రూసా కింద చేపట్టే పనుల్లో సింగల్‌ టెండర్‌ దాఖలైన నేపథ్యంలో తదుపరి చర్యలకు, దినసరి వేతనదారులు, ఎన్‌ఎంఆర్‌లకు జీతాలు పెంపుపైనా చర్చించనున్నారు. కామన్‌ పీజీ అడ్మిషన్‌ టెస్టుపైనా చర్చించనున్నారని తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని