ఉత్కంఠ రేపిన పిల్లుట్ల ఫలితం
eenadu telugu news
Published : 20/09/2021 02:59 IST

ఉత్కంఠ రేపిన పిల్లుట్ల ఫలితం

గురజాల, న్యూస్‌టుడే : మాచవరం మండలం పిల్లుట్ల 1 ఎంపీటీసీ ఫలితం ఉత్కంఠ రేపింది. తెదేపా అభ్యర్థి అంజమ్మ 10 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే వైకాపా మళ్లీ లెక్కించాలని కోరడంతో ఉత్కంఠ రేగింది. అధికార పార్టీ వైపునకు ఫలితం వస్తుందన్న భావన వ్యక్తమైంది. భోజనాలు చేసిన తరువాత మరలా లెక్కించారు. ఏడు ఓట్ల ఆధిక్యం రావడంతో అంజమ్మ గెలుపొందినట్లు ప్రకటించి ధ్రువపత్రం అందజేశారు. గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్‌ నేతృత్వంలో సీఐలు సుబ్బారావు, సురేంద్రబాబు, ఉమేష్‌ బందోబస్తు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని