అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్‌ అభినందన
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్‌ అభినందన

గుంటూరు, న్యూస్‌టుడే: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా కృషి చేసిన జేసీలు, జిల్లా అధికారులు, కౌంటింగ్‌ కేంద్రాల పర్యవేక్షకులు, ఓట్ల లెక్కింపు సూపర్‌వైజర్లు, లెక్కింపు సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులను సమన్వయం చేసుకుంటూ పటిష్ఠ బందోబస్తు చేపట్టిన అర్బన్, రూరల్‌ ఎస్పీలు ఆరీఫ్‌ హఫీజ్, విశాల్‌ గున్నీలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. యంత్రాంగానికి సహకరించిన పోటీలోని వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు, కౌంటింగ్‌ ఏజెంట్లకు కలెక్టర్‌ ధన్యవాదాలు తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని