ఎమ్మెల్యే బంధువులపై ఫిర్యాదు
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

ఎమ్మెల్యే బంధువులపై ఫిర్యాదు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ఆమె మామ, మరిది తన అనుచరులతో హత్యాయత్నం చేశారని వారిపై కేసు నమోదు చేసి రక్షణ కల్పించాలంటూ నవతరం పార్టీ నాయకులు సోమవారం రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ పార్టీ వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్యం విలేకరులతో మాట్లాడారు. తాము తమ పరిధిలోని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యే మామ, మరిది గత కొంతకాలంగా ఫోన్‌లు చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. రూ.కోట్ల విలువచేసే యడవల్లి భూములు వందల ఎకరాలు, బొప్పూడి, రాజాపేటలోని రైతుల భూములు అన్యాక్రాంతం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. కూరగాయల మార్కెట్‌కు పెట్టిన స్వాతంత్ర సమరయోధుని పేరును మార్చి తమపార్టీ నాయకుడి పేరు పెట్టాలని చూస్తుంటే వాటిని అడ్డుకుంటున్నామని తమపై కక్ష్యకట్టారని ఆరోపించారు. ఆయన వెంట నాయకులు రమేష్‌కుమార్‌, కవిత, రామతులసి, అంకమ్మరావు, అశోక్‌కుమార్‌, శివ, విజయరాజ్‌లు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని