AP News: వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా-తెదేపా వర్గాల మధ్య ఘర్షణ
eenadu telugu news
Published : 21/09/2021 02:13 IST

AP News: వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా-తెదేపా వర్గాల మధ్య ఘర్షణ

గుంటూరు: పెదనందిపాడు మండలం కొప్పర్రులో సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో మాజీ జడ్పీటీసీ శారద ఇంట్లోకి దూరి వైకాపా  వర్గీయులు సామగ్రి ధ్వంసం చేశారు. రాళ్లతో దాడి చేశారు. ఆమె ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.  దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని